News March 17, 2024

ఏపీ ప్రజలకు మోదీ విజ్ఞప్తి

image

ఏపీ ప్రజలు 2 సంకల్పాలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తొలి సంకల్పం కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం. రెండో సంకల్పం APలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం. ఇవి మనసులో పెట్టుకుని ప్రజలు ఓటేయాలి. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తోంది. NDA సర్కారును గెలిపిస్తే AP అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా’ అని వెల్లడించారు.

Similar News

News November 5, 2024

రాష్ట్రంలో ఘోరం.. మహిళపై గ్యాంగ్ రేప్

image

TG: HYD మధురానగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్‌లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్‌లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.

News November 5, 2024

Wikiకి కేంద్రం నోటీసులు

image

అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్‌గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్‌ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్‌తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.

News November 5, 2024

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

AP: ఓ విలేకరి హత్య కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తుని నియోజకవర్గం తొండంగికి చెందిన విలేకరి సత్యనారాయణ 2019 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు. దీనికి సూత్రధారి దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రాజా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.