News January 16, 2025
గ్రౌండ్ స్టాఫ్‌కు MCA జంబో గిఫ్ట్ హాంపర్స్.. ఏమేం ఉన్నాయంటే?
వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ 178 మంది గ్రౌండ్ స్టాఫ్‌కు జంబో గిఫ్ట్ హాంపర్స్ అందజేసింది. ఇందులో 5 కిలోల చొప్పున గోధుమ పిండి, బియ్యం, పప్పు, ఒక మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్స్, బ్యాక్ ప్యాక్స్, కిట్ బ్యాగ్, టవల్స్, పెన్స్, నోట్ పాడ్స్, బెడ్ షీట్స్, ట్రాక్ పాంట్స్, జాకెట్స్, సన్ గ్లాసెస్, హాట్స్, రెయిన్ కోట్, అంబ్రెల్లా, సన్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.
Similar News
News January 16, 2025
BREAKING: సముద్రంలో మునిగి ముగ్గురు మృతి
AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోగా, ఒకరిని జాలర్లు కాపాడారు. మరో వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. మృతులను పొన్నలూరు మండలం తిమ్మపాలెం వాసులుగా గుర్తించారు. డెడ్ బాడీలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News January 16, 2025
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్: అశ్వినీ వైష్ణవ్
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్(NGLV) ద్వారా భారీ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈ లాంచ్‌ప్యాడ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. అందుకు రూ.3,985 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
News January 16, 2025
ఆసియన్ గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే: స్పోర్ట్స్‌కీడా
ఆసియాలో 21వ శతాబ్దపు టెస్టు క్రికెట్‌లో గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే అంటూ ‘స్పోర్ట్స్ కీడా’ ఓ టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు జయవర్ధనే కెప్టెన్‌గా ఉన్నారు. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, సచిన్ టెండూల్కర్, సంగక్కర, అశ్విన్, రంగనా హెరాత్, షోయబ్ అక్తర్, జస్ప్రిత్ బుమ్రా, ముత్తయ్య మురళీధరన్, కోహ్లీని 12వ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. టెస్టు క్రికెట్‌లో మీ టీమ్-11 ఎవరో కామెంట్ చేయండి.