News January 16, 2025

నెల్లూరు: తిరుగు ప్రయాణంలో నిలువ దోపిడి

image

సంక్రాంతికి సొంతూర్లకు వచ్చి తిరిగి వెళ్లేవారికి ప్రయాణం ఖరీదుగా మారింది. నెల్లూరుజిల్లా నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి RTC అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అవి సరిపోకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. దీంతో వారు టికెట్ రేట్లను రెండింతలు పెంచి నిలువ దోపిడి చేస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సిరావడంతో ప్రజలు అధిక ధరలు చెల్లించి ప్రయాణిస్తున్నారు.

Similar News

News February 27, 2026

చెవులు మూసుకుని నెల్లూరు MLC నిరసన

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారంతా మండలిలో కింద కూర్చొని ఆందోళన చేశారు. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెవులు మూసుకుని, ఇతర MLCలు కళ్లు, నోరు మూసుకుని తమ నిరసన తెలిపారు.

News February 27, 2026

నెల్లూరు DPO కీలక ఆదేశాలు

image

నెల్లూరు జిల్లాలోని పంచాయతీల్లో 100% ఇంటి పన్నులను సెక్రటరీలు వసూలు చేయాలని DPO వసుమతి ఆదేశించారు. జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పాదలకూరు, కోవూరు, వింజమూరు, రాపూరు పంచాయతీల్లో పన్నులు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. వీటిని రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.

News February 27, 2026

నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.