News January 16, 2025

కి.మీ.కు రూ.3.91 కోట్లు.. సైకిల్ ట్రాక్ పగుళ్లపై కాంగ్రెస్ విమర్శలు

image

హైదరాబాద్‌లోని సైకిల్ ట్రాక్‌పై పగుళ్లు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు గత BRS సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘కాళేశ్వరం, సుంకిశాల.. ఇప్పుడు సైకిల్ ట్రాక్. కేటీఆర్ కట్టించిన సైకిల్ ట్రాక్ పరిస్థితి ఇది’ అని పగుళ్లు వచ్చిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్ గూడ నుంచి ORR ఇంటర్‌ఛేంజ్ వరకు రెండు వైపులా 23 కి.మీ మేర ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. కి.మీకు రూ.3.91 కోట్ల మేర ఖర్చయింది.

Similar News

News September 17, 2025

ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా

image

టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. ఆటోమేటిక్ ఫైనల్ మార్క్ 84.50 మీ. కాగా ఆయన తొలి అటెంప్ట్‌లోనే జావెలిన్‌ను 84.85 మీ. విసిరారు. వెబెర్(జర్మనీ) 87.21 మీ., వెంగెర్(పోలెండ్) 85.67 మీ. విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్ రేపు జరగనుంది. ఇక 2023లో బుడాపేస్ట్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ గోల్డ్ కొల్లగొట్టారు.

News September 17, 2025

ఓంకారం ఓ ఆరోగ్య సంజీవని

image

ఓంకారం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. ఇది ఓ సంపూర్ణ ఆరోగ్య సంజీవని. నాభి నుంచి పలికే ఈ లయబద్ధమైన శబ్దం శరీరంలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుంది. దీని పఠనం రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తొలగించి, అపారమైన ప్రశాంతతను అందిస్తుంది. ఓంకారం మనసు, శరీరం, ఆత్మల ఏకీకరణకు ఓ శక్తిమంతమైన సాధనం.

News September 17, 2025

కుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా?

image

సుబ్రహ్మణ్య స్వామి, కుమార స్వామి వేర్వేరు కాదు. ఆయన శివ పార్వతుల కుమారుడు. గణపతి, అయ్యప్పలకి సోదరుడు. శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అనే పేరొచ్చింది. ఆయణ్నే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఆయనను దేవతల సైన్యాధిపతిగా, జ్ఞానానికి, యుద్ధానికి దేవుడిగా పూజిస్తారు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో దర్శనమిచ్చే ఆయన ఆధ్యాత్మిక శక్తికి, పవిత్రతకు ప్రతీక.