News January 16, 2025
IND క్రికెటర్లు, కోచ్‌పై కఠిన ఆంక్షల వెనుక..

క్రికెటర్లపై BCCI <<15152483>>కఠిన ఆంక్షల<<>> వెనుక తీవ్ర కారణాలున్నట్లు TOI వెల్లడించింది. ‘AUS టూర్‌లో ప్లేయర్లు గ్రూపులుగా ట్రావెల్ చేశారు. దీంతో జట్టు బాండింగ్ మిస్సయ్యింది. ఆ మొత్తం పర్యటనలో ఒకేసారి టీమ్ డిన్నర్ జరిగింది. పలువురు తమ కుటుంబాలతో హోటళ్లలో స్టే చేస్తున్నారు. ఆఖరికి కోచ్ గంభీర్ కూడా క్రికెటర్లతో కాకుండా తన సొంత మనుషులతో బయటకు వెళ్లారు. దీంతోనే BCCI ఈ చర్యలకు దిగింది’ అని పేర్కొంది.
Similar News
News January 2, 2026
మున్సిపల్ ఎన్నికలు.. సీఎం జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. వచ్చే నెల 3న జడ్చర్లలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తర్వాత మిగతా జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.
News January 2, 2026
రోడ్డుపై పొగమంచు.. ఈ జాగ్రత్తలు పాటించండి!

చలి తీవ్రత పెరగడంతో రహదారులపై పొగమంచు <<18738127>>దట్టంగా<<>> పేరుకుపోతోంది. దీనివల్ల ముందున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి, ఫాగ్ లైట్లను, పార్కింగ్ లైట్స్ వాడాలని సూచిస్తున్నారు. ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలని, సింగిల్ వేలో ఓవర్‌టేక్ చేయవద్దని కోరుతున్నారు. మలుపుల వద్ద ఇండికేటర్లు వాడాలని చెబుతున్నారు. share it
News January 2, 2026
ఈ ఫ్రూట్స్‌తో క్యాన్సర్ దూరం

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, పనస, వాక్కాయలు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.


