News January 16, 2025

ఆసియన్ గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే: స్పోర్ట్స్‌కీడా

image

ఆసియాలో 21వ శతాబ్దపు టెస్టు క్రికెట్‌లో గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే అంటూ ‘స్పోర్ట్స్ కీడా’ ఓ టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు జయవర్ధనే కెప్టెన్‌గా ఉన్నారు. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, సచిన్ టెండూల్కర్, సంగక్కర, అశ్విన్, రంగనా హెరాత్, షోయబ్ అక్తర్, జస్ప్రిత్ బుమ్రా, ముత్తయ్య మురళీధరన్, కోహ్లీని 12వ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. టెస్టు క్రికెట్‌లో మీ టీమ్-11 ఎవరో కామెంట్ చేయండి.

Similar News

News January 16, 2025

‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్

image

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News January 16, 2025

కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)

image

రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్‌ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్‌లో కనిపించారు. రెగ్యులర్‌గా సాధారణ డ్రెస్‌లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్‌తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్‌లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.

News January 16, 2025

PHOTO: చంద్రబాబుతో నితీశ్ కుమార్ రెడ్డి

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీశ్‌కు సీఎం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ గడ్డపై చరిత్ర సృష్టించి తెలుగువారు గర్వపడేలా చేశాడని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. నితీశ్ వెంట ఆయన తండ్రితో పాటు ACA అధ్యక్షుడు ఉన్నారు.