News March 17, 2024

రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్

image

TS: రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నారు. తనను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలున్నా, ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొననున్నారు. కవిత తరఫున కపిల్ సిబాల్, రోహత్గీ కోర్టులో వాదించనున్నారు.

Similar News

News September 8, 2025

‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం: TS UTF

image

TG: ప్రభుత్వ టీచర్లకు TET తప్పనిసరి అని ఇచ్చిన <<17587484>>తీర్పును<<>> సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF) కోరింది. ’20-25 ఏళ్లుగా విధుల్లో ఉన్న సీనియర్లను TET రాయమనడం అన్యాయం. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి. 2010 NCTE నోటిఫికేషన్ ప్రకారం TET పాస్ అనేది నియామకాలకు తప్పనిసరి అయింది’ అని గుర్తుచేసింది.

News September 8, 2025

రజినీకాంత్‌తో పోటీ లేదు: కమల్ హాసన్

image

రజినీకాంత్‌కు, తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని కమల్ హాసన్ తెలిపారు. ఆడియన్సే తమ మధ్య కాంపిటీషన్ ఉన్నట్లు భావిస్తారని అన్నారు. ‘మేమిద్దరం ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని అనుకునేవాళ్లం. ఎప్పటినుంచో కలిసి నటించాలనుకుంటున్నాం. త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం’ అని వెల్లడించారు. కాగా రజినీ, కమల్ హీరోలుగా లోకేశ్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

News September 8, 2025

భారత్ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్

image

అత్యధిక పరుగుల తేడాతో వన్డే మ్యాచ్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన <<17643575>>మూడో వన్డేలో<<>> ఆ జట్టు 342 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమ్ ఇండియా 317 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2023లో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై 309 రన్స్ తేడాతో గెలుపొందింది.