News January 16, 2025
సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కడప కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 18న మైదుకూరులో పర్యటించే అవకాశం ఉందని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ డా.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా వివరాలు అందాల్సి ఉందన్నారు.
Similar News
News December 30, 2025
పుష్పగిరిలో అపశ్రుతి.. వైకుంఠ ద్వార దర్శనం రద్దు

కడప జిల్లాలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని మంగళవారం తాత్కాలికంగా నిలిపివేశారు. పుష్పగిరి గ్రామ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో సంప్రదాయ నియమాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారని తెలుస్తోంది.
News December 29, 2025
కడప: న్యూ ఇయర్ వేళ బేకరీలపై నిఘా

నూతన సంవత్సరం సందర్భంగా కడప నగరంలోని పలు బేకరీలు, కేక్ తయారీ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కమిషనర్ మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం హెల్త్ ఆఫీసర్ డా.రమేశ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిణి కేక్ తయారీ విధానాన్ని పరిశీలించారు. తయారీ కేంద్రాల్లో శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
News December 29, 2025
మారనున్న కడప జిల్లా స్వరూపం

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కడప జిల్లా స్వరూపం మారనుంది. ప్రస్తుతం 36 మండలాలుగా ఉన్న జిల్లా 40 మండలాలుగా మారనుంది. కొత్తగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి, నందలూరు మండలాలతో రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోని విలీనం చేశారు.


