News January 16, 2025
ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు

US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న వాషింగ్టన్ డీసీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని వీధుల్లో 48KM మేర 7 అడుగుల ఫెన్సింగ్‌ను నిర్మిస్తున్నారు. 25వేల మంది పోలీసులతోపాటు 7,800 మంది సైనికులను మోహరించనున్నారు. వైట్ హౌస్ చుట్టూ 2KM పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News January 18, 2026
నేటి నుంచి నాగోబా జాతర

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.
News January 18, 2026
దానిమ్మలో ‘భగవా’ రకం ప్రత్యేకం

దానిమ్మలో చీడపీడల బెడద ఎక్కువ. అందుకే ఈ పంటను చాలా జాగ్రత్తగా సాగు చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన భగవా దానిమ్మ రకం ప్రత్యేకమైనది. కాయ సైజు పెద్దగా ఆకర్షణీయమైన కుంకుమ రంగులో ఉండటంతో పాటు రుచి చాలా తియ్యగా ఉంటుంది. దీనిపైన తొక్క కూడా మందంగా ఉంటుంది. ఇతర రకాలతో పోలిస్తే భగవా రకం పండ్లు చీడపీడలు, తెగుళ్లను తట్టుకొని మచ్చలకు తక్కువగా గురవుతాయి. మార్కెట్‌లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది.
News January 18, 2026
నేషనల్ టెస్ట్ హౌస్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


