News March 17, 2024

HYD: KCRను మోసం చేయడం సిగ్గుచేటు: ఆనంద్‌ గౌడ్

image

గోషామహల్‌లో BRS అభ్యర్థిగా పోటీ చేసిన నందకిశోర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడం సరికాదని ఆ పార్టీ నేత ఆనంద్‌ గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న వ్యక్తిని ఎంత నీచంగా అభివర్ణించినా తక్కువేనని అన్నారు. లోకల్ లీడర్ కాకపోయినా MLA టికెట్, ఆయన కూతురికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన KCRను మోసం చేయడం సిగ్గుచేటు అంటూ ఆనంద్‌ మండిపడ్డారు.

Similar News

News February 13, 2026

రంగారెడ్డి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 59 వార్డుల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 24 కాంగ్రెస్, 23 BRS, 7 BJP, ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం చేసుకుంది. చేవెళ్లలో 4 INC, 4 BRS, 1 BJP గెలిచాయి. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. ఆమన్‌గల్లులో INC బోణీ చేయలేదు. శంకర్‌పల్లిలో హోరా హోరీ నడుస్తోంది.

News February 13, 2026

రంగారెడ్డి: ఓట్ల లెక్కింపు 64 టేబుళ్లు ఏర్పాటు

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులుండగా వీటిల్లో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు.

News February 13, 2026

RR: 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక

image

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు వెళ్లడైన వెంటనే ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రారంభంకానుంది. ఈ నెల 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.