News January 16, 2025
ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అటు సుమారు 7 గంటలపాటు కేటీఆర్‌ను అధికారులు విచారించారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు రూ.45 కోట్లు చెల్లించడంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించారు.
Similar News
News January 17, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 17, 2025
భక్తులకు టీటీడీ కీలక సూచనలు
AP: నేటితో వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ ముగియనుందని భక్తులకు టీటీడీ సూచించింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం క్యూలైన్‌లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ నెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
News January 17, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 17, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.27 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.