News March 17, 2024
BREAKING: పరీక్ష వాయిదా

AP: ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13న జరగాల్సిన డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. కాగా 38 DyEO పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
Similar News
News September 8, 2025
రజినీకాంత్‌తో పోటీ లేదు: కమల్ హాసన్

రజినీకాంత్‌కు, తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని కమల్ హాసన్ తెలిపారు. ఆడియన్సే తమ మధ్య కాంపిటీషన్ ఉన్నట్లు భావిస్తారని అన్నారు. ‘మేమిద్దరం ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని అనుకునేవాళ్లం. ఎప్పటినుంచో కలిసి నటించాలనుకుంటున్నాం. త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం’ అని వెల్లడించారు. కాగా రజినీ, కమల్ హీరోలుగా లోకేశ్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
News September 8, 2025
భారత్ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్

అత్యధిక పరుగుల తేడాతో వన్డే మ్యాచ్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన <<17643575>>మూడో వన్డేలో<<>> ఆ జట్టు 342 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమ్ ఇండియా 317 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2023లో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై 309 రన్స్ తేడాతో గెలుపొందింది.
News September 8, 2025
నేడు CPGET-2025 ఫలితాలు

TG: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET-2025) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. గత నెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 45,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. CPGET <