News March 17, 2024

నా రంగు విషయంలో అవమానాలు ఎదుర్కొన్నా: భూమి శెట్టి

image

తన శరీర రంగు విషయంలో చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని హీరోయిన్ భూమి శెట్టి తెలిపారు. ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘రంగుపై ఇతరుల మాటలతో ఎంతో బాధపడ్డా. ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏవైనా క్రీమ్స్ వాడాలని చెప్పేవారు. ఇప్పటికీ ఇన్‌స్టాలో ఫొటోలకు నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు. నా అందం గురించి నాకు తెలుసు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 21, 2024

వైభవ్ సూర్యవంశీ మరో ఘనత

image

బిహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ (13 yrs 269 days)నిలిచారు. ఇవాళ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఆయన లిస్ట్-ఏ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ (14 yrs 51 days) ఉండేది. కాగా ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన పిన్న వయస్కుడిగానూ వైభవ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

News December 21, 2024

వివాదం కోరుకోవడం లేదంటూనే బన్నీ విమర్శలు

image

ప్రభుత్వంతో వివాదం కోరుకోవడం లేదంటూనే TG CMకు బన్నీ కౌంటర్ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా రోడ్ షో చేశారని అసెంబ్లీలో రేవంత్ అంటే, రావద్దని పోలీసులు అప్పుడే చెబితే వెనక్కి వెళ్లేవాన్నని బన్నీ చెప్పారు. ఇక అది రోడ్ షో కాదని, కార్‌పై నుంచి చేయి ఊపానన్నారు. అటు ప్రమాదం గురించి చెప్పి, వెళ్లాలని పోలిస్ హెచ్చరించినా మళ్లీ చేతులూపుతూ వెళ్లారని CM అన్నారు. అయితే తనకు వారు ఏమీ చెప్పలేదని బన్నీ పేర్కొన్నారు.

News December 21, 2024

మినీ ఇండియాలా కువైట్: ప్రధాని మోదీ

image

కువైట్‌ను చూస్తోంటే మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశంలో ఇంతమంది భారతీయులను చూడటం సంతోషంగా ఉందని చెప్పారు. ‘కువైట్ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించే చెబుతుంటారు. విదేశీ కరెన్సీ ఆర్జనలో భారత్ టాప్‌లో ఉంది. మీరంతా కష్టపడటం వల్లే ఇది సాధ్యమైంది. భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలే కాదు.. విడదీయలేని మైత్రి కూడా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.