News January 17, 2025
మచిలీపట్నం: మెయిన్స్‌కు 262 మంది క్వాలిఫై

మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు పురుష అభ్యర్థులు 390 మంది హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 128 మంది డిస్ క్వాలిఫై అయ్యారని పేర్కొంది. 262 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది.
Similar News
News January 26, 2026
విశాఖలో కృష్ణా జిల్లా విద్యార్థి అనుమానాస్పద మృతి

అవనిగడ్డ ప్రాంతానికి చెందిన AU MCA ఫస్ట్ ఇయర్ విద్యార్థి లీలా సాయి విశాఖ నగరంలోని రేసవానిపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహం కుళ్లి, దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం పోలీసులు తలుపులు తెరిచి పరిశీలించగా ఘటన వెలుగులోకి వచ్చింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 25, 2026
అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాలో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిభ కనబర్చారు.
News January 25, 2026
కృష్ణా: పద్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి నేపథ్యం ఇదే..!

కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వెంపటి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1950 ఆగస్ట్ 12న గుడ్లవల్లేరులో ఆయన జన్మించారు. అద్వైత-వేదాంత, దర్శనాలు, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్యంలో సంస్కృత పండితులు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు.


