News March 17, 2024
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో ‘కాల్ సెంటర్’

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆదివారం తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు 1950, 08672-2252533కి ఫోన్ చేసి సందేహాలు, ఫిర్యాదులు చేయొచ్చని కలెక్టర్ చెప్పారు.
Similar News
News February 5, 2026
పాఠశాలల ప్రగతిలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

తాము చదువుకున్న పాఠశాలలను మర్చిపోకుండా, వాటి అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ వంతు సాయం అందించడం అభినందనీయమన్నారు. పాఠశాలల బలోపేతానికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని, వారి భాగస్వామ్యం నేటి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News February 5, 2026
కృష్ణా: రేపు నిమ్మకూరులో TDP నూతన కార్యవర్గ ప్రమాణం!

TDP జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని రేపు NTR స్వగ్రామమైన నిమ్మకూరులో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి NTR కుమారుడు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
News February 4, 2026
‘డిసెంబర్ 31 నాటికి బందరు పోర్ట్ తొలి దశ పూర్తి’

బందరు ఓడరేవు తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్ జీఎం తులసీదాసు తెలిపారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలోని బృందం ప్రాజెక్ట్ పనులను బుధవాం పరిశీలించింది. 2000 ఎకరాల్లో సాగుతున్న పనుల్లో 1300 మంది కూలీలు పనిచేస్తున్నట్లు వివరించారు.


