News January 17, 2025
100 ఏళ్లుగా కుంభమేళాకు వస్తున్న స్వామి

యూపీకి చెందిన యోగా సాధకులు స్వామి శివానంద 100 ఏళ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరవుతున్నారని ఆయన శిష్యులు చెబుతున్నారు. ఆధార్ ప్రకారం ఆయన వయసు 129 ఏళ్లు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 16వద్ద ఆయన క్యాంపు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం యోగా చేస్తుండగా ఆయన కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఆయన ఉప్పు, నూనె లేకుండా ఉడికించిన ఆహారం తీసుకుంటారని తెలిపారు. రెండేళ్ల క్రితం ఆయనను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.
Similar News
News March 14, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’ను డైరెక్ట్ చేస్తున్నారు.
News March 14, 2025
సీఎం ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు: మంత్రి పొన్నం

TG: తమ ప్రభుత్వంలో ఏ నిర్ణయమైనా CM ఒక్కరే తీసుకోరని, అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై BRS నిరసనకు దిగడం సిగ్గుచేటని అన్నారు. ‘తాము అనుకున్నట్లుగా సభ నడవాలనేది BRS నేతల ఉద్దేశం. అందుకే దుష్ప్రచారాలు చేస్తున్నారు. స్పీకర్‌గా దళితుడు ఉన్నారనే అవమానించారు. పొరపాటు అయ్యిందని చెబితే వివాదం ముగిసేది’ అని వ్యాఖ్యానించారు.
News March 14, 2025
ట్రైన్ హైజాక్: పాక్ ఆరోపణల్ని తిప్పికొట్టిన భారత్

బలూచిస్థాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ జోక్యంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానమేదో ప్రపంచం మొత్తానికీ తెలుసని పేర్కొంది. ‘పాక్ నిరాధార ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్మథనం చేసుకోవాలి’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. BLAకు అఫ్గాన్ సాయం, భారత్‌పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది.