News March 17, 2024

ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన CSK

image

ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని తమిళనాడులోని AIADMK పార్టీకి డొనేట్ చేసినట్లు ఈసీ పేర్కొంది. అలాగే CSK ఓనర్ ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.10 కోట్ల విలువచేసే బాండ్లను కొనుగోలు చేసి DMK పార్టీకి డొనేట్ చేసింది.

Similar News

News April 11, 2025

విరాట్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ విమర్శలు

image

నిన్న రాత్రి DCతో మ్యాచ్‌లో RCBకి సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. డీసీ బౌలర్ స్టార్క్ వేసిన ఒక ఓవర్లోనే 30 రన్స్ వచ్చాయి. బెంగళూరు కచ్చితంగా 220 ప్లస్ స్కోర్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో విరాట్ సాల్ట్‌ను రనౌట్ చేసి మంచి ఊపును దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు విరాట్ తప్పులేదంటూ కొంతమంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.

News April 11, 2025

BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

image

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.

News April 11, 2025

చైనాపై 145శాతానికి చేరిన అమెరికా సుంకాలు

image

చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 145 శాతానికి చేరాయి. వాస్తవంగా టారిఫ్‌ల పర్సంటేజీ 125 శాతానికి చేరింది. అయితే గతంలో ఫెంటానిల్ అక్రమ రవాణా కాకుండా విధించిన 20 శాతాన్ని అమెరికా తాజాగా గుర్తుచేసింది. దానితో కలిపి మొత్తం టారిఫ్‌లు 145శాతానికి చేరుకున్నాయని ట్రంప్ యంత్రాంగం వివరించింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84శాతం సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!