News January 17, 2025

వనపర్తి: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYDలోని అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వనపర్తి(D) పెద్దగూడెంకు చెందిన భానుప్రకాశ్ ఓ కళాశాలలో బీటెక్ 1st ఇయర్ చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై ఉరేసుకున్నాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. అమ్మానాన్నలకు నోట్ బుక్‌లో లేఖను రాసినట్లు తెలుస్తోంది.

Similar News

News January 2, 2026

MBNR: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్.. అప్లై చేసుకోండి

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు 100% సబ్సిడితో ఆర్ధిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి యస్.జరీనా బేగం తెలిపారు. అర్హులైన ముగ్గురు(3) ట్రాన్స్ జెండర్స్ కు ఒక్కొకరికి రూ.75వేల చొప్పున మొత్తం 1 యూనిట్‌కు రూ.75 వేలు 100% సబ్సిడీ మీద జిల్లాకు కేటాయించడం జరిగిందని, ఈనెల 9లోగా దరఖాస్తును కార్యాలయంలో సమర్పించారన్నారు.

News January 1, 2026

మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

image

@ జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
@ మిడ్జిల్ మండలం లింబ్యాతాండ గేటు వద్ద వ్యక్తి మృతి
@ దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమీక్ష
@ బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో కారుతో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తిపై కేసు నమోదు
@ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

News January 1, 2026

MBNR: ట్రాలీ బోల్తా.. 15 మేకలు మృతి

image

ఇల్లందు మండలం పోచారం తండా సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మేకలు మృతి చెందాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంచార జీవుల మేకల ట్రాలీ, గుండాల మండలం శెట్టిపల్లి నుండి మేత కోసం వెళ్తుండగా పోచారం గుట్ట వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, లోపల ఉన్న 15 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.