News January 17, 2025

ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,632

image

ఆదోని మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,632 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 1,785 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,632, సరాసరి రూ.7,389, కనిష్ఠ ధర రూ.5,580తో అమ్మకాలు జరిగాయి.

Similar News

News January 17, 2025

‘ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదు’

image

విజయ డెయిరీలో అప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వర్గీయులు పాల ఉత్పత్తి కర్మాగారం వద్ద దౌర్జన్యం చేసి నామినేషన్లను వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. దౌర్జన్యాలకు దిగి ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా ఎన్నికలకు విలువ లేకుండా పోతుందన్నారు.

News January 17, 2025

‘చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ’

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం హర్షనీయమని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. శుక్రవారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు  నాయకత్వంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం జీవం పోసిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ కృషి చేసిందన్నారు.

News January 17, 2025

దేహదాధారుఢ్య పరీక్షల్లో 323 మంది ఎంపిక

image

పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు APSP 2వ బెటాలియన్‌లో 8వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో జరిగిన పరీక్షలకు 600 మంది అభ్యర్థులను పిలవగా.. 323 మంది అభ్యర్ధులు బయోమెట్రిక్‌కు హజరయ్యారు.