News January 17, 2025
బాలయ్య అభిమానులకు షాక్ ఇచ్చిన తిరుపతి పోలీసులు

డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా పొట్టేలును బలిచ్చిన ఐదుగురు బాలకృష్ణ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. SI బాలకృష్ణ వివరాల ప్రకారం.. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఐదుగురు బాలకృష్ణ అభిమానులు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ ఎదుట ఈనెల 12న పొట్టేలును బలిచ్చి ఆ రక్తం సినిమా పోస్టర్‌కు అంటించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Similar News
News November 12, 2025
నేడు జిల్లా వ్యాప్తంగా 10,168 గృహ ప్రవేశాలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 10,168 గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మరోవైపు PMAY 2.O క్రింద 2,472 ఇళ్లులు మంజూరు కాగా వాటి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1లక్షను అందించనుంది.
News November 11, 2025
మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.
News November 11, 2025
పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.


