News January 17, 2025

నెల్లూరు: ఆర్నెల్ల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం

image

సరదాగా గడిపి సేదతీరేందుకు వెళ్లిన ముగ్గురిని కడలి బలితీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ(25)కు, నెల్లూరు జిల్లా, కందుకూరు(M), అనంతసాగరానికి చెందిన నవ్వతో ఆర్నెల్ల క్రితం పెళ్లి అయ్యింది. సంక్రాంతి సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి వారు పాకల బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో అలల్లో చిక్కుకుని మాధవ, నవ్య సోదరి యామిని, మాధవ బాబాయ్ కుమార్తె జెస్సికా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News April 18, 2026

పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

News April 18, 2026

పొదలకూరు: బస్తా రూ.12 వేలు

image

పొదలకూరు ప్రాంతంలో నిమ్మకాయల ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం 80 కిలోల బస్తా ధర రూ.10,500 నుంచి రూ.12 వేలు వరకు పలుకుతుండగా, సమీప రోజుల్లో ఇది రూ.15,000 చేరే అవకాశముందని వ్యాపారులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, సరఫరా పరిమితం కావడం వల్ల ధరలు భారీగా పెరిగాయి. రోజుకు 10 నుంచి 15 లారీల వరకు లక్నో, ఢిల్లీ, చెన్నై తరలి పోతున్నాయి.

News April 18, 2026

నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.