News March 17, 2024
గుంటూరులో కలెక్టర్ స్పందన కార్యక్రమం రద్దు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎలక్షన్ కోడ్ ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్పందనలో ఫిర్యాదులు అందించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News February 4, 2026
గుంటూరు జిల్లాలో ర్యాలీలు, సభలు నిషేధం: ఎస్పీ

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం పోలీస్ యాక్ట్-30 అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 4, 2026
ఈ-కేవైసీ పనులను వేగవంతం చేయాలి: గుంటూరు కలెక్టర్

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ముందుగానే రైతులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 9వ తేదీలోపు
ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ, ఇతర పనులను పూర్తి చేసి పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DRO ఖాజావలి, జేసీ శ్రీవాత్సవ పాల్గొన్నారు.