News January 17, 2025
కడప అభివృద్ధికి నిధులు ఇవ్వండి: శ్రీనివాస రెడ్డి
కడప నగర అభివృద్ధికి ప్రభుత్వం స్పందించి నిధులను మంజూరు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన నిన్న రాత్రి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కడప నగరంతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల విషయమై చర్చించారు. ఎన్నికల సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీల అమలకు కృషి చేయాలన్నారు.
Similar News
News January 17, 2025
మైదుకూరుకు సీఎం.. షెడ్యూల్ ఖరారు!
మైదుకూరులో రేపు CM చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12 గం. నుంచి హెలికాఫ్టర్ ద్వారా మైదుకూరు చేరుకుని, అనంతరం 12:20 నుంచి 1 గం. వరకు NTR వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1:55 నుంచి మైదుకూరు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇళ్లను సందర్శిస్తారు. 2:15 నుంచి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
News January 17, 2025
పులివెందులలో MLC సతీమణి ధర్నా
పులివెందుల పట్టణంలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేషన్ డీలర్లకు సంబంధించి రాత పరీక్ష జరుగుతోంది. వేంపల్లికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని కొంతమంది కిడ్నాప్ చేయడంతో ఆ వ్యక్తి రాత పరీక్షకు హాజరు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న దుండగులు ప్రకాశ్‌ను పులివెందులలోని పరీక్షా కేంద్రం వద్ద విడిచిపెట్టారు.
News January 17, 2025
తిరుపతి రుయాలో కడప జిల్లా మహిళ మోసం
కడప జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి ఐదేళ్ల కిందట తిరుపతి రుయాలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేసి ఆగిపోయింది. తాజాగా సంక్రాంతి రోజు కోటు వేసుకుని రుయాకు వెళ్లింది. ఓ రోగిని స్కానింగ్ రూములోకి తీసుకెళ్లి ఒంటిపై బంగారం ఉండకూదని చెప్పింది. గాజులు, చైన్లు తీసుకుంది. తర్వాత బయటకు వచ్చి రోగి బంధువుకు బంగారం ఇచ్చి.. ఓ చైన్ మాయం చేసింది. సెక్యూరిటీ సిబ్బంది శ్రీవాణి కోటులో చైన్ గుర్తించడంతో కేసు నమోదైంది.