News January 17, 2025
OTTలోకి సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్

సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాల్ లోక్’ నుంచి సీజన్-2 వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఒక్కో ఎపిసోడ్ 42-45 నిమిషాల నిడివి ఉంది. 2020లో విడుదలైన సీజన్-1కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News March 14, 2025
కొత్తకోట: స్కూటీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కొత్తకోట పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ముమ్మళ్ళపల్లి గ్రామానికి చెందిన శేషన్న, సుధాకర్‌లు స్కూటీపై కొత్తకోటకు వచ్చి పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా స్కూటీలో మంటలు వస్తున్నట్లు గమనించి వెంటనే ఆపి పక్కకు జరిగారు. సమీపంలో ఫైర్ స్టేషన్ ఉండడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్