News January 17, 2025
దిలావర్‌పూర్: అటవీ ప్రాంతంలో భార్యాభర్తల SUICIDE

ఇద్దరు భార్యాభర్తలు ఉరేసుకొని మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2026
ఆదిలాబాద్: లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు ఎక్కువ పరిష్కరించేలా దృష్టి పెట్టాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్ రావు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు హల్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పాలన అధికారులు

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా సేవలందించిన వారిని గ్రామ పాలన అధికారులుగా నియమించి గ్రామ స్థాయిలో జరిగే అంశాలను ప్రభుత్వానికి అందజేస్తూన్నట్లు తెలిపారు.
News February 24, 2026
జూడోలో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుల విజయం

సీఎం కప్ 2025-26 జూడోలో ఆదిలాబాద్ క్రీడాకారుల విజయం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన పతకాలు సాధించిన విజేతలను ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల శంకర్ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూడో క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.


