News January 17, 2025

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ హామీని కేంద్రం నిలబెట్టుకుంది: రామ్మోహన్

image

విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు డైరెక్ట్ ఈక్విటీ కింద రూ.10,300Cr, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140Cr బదిలీ చేసేలా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. దీంతో ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి

image

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన హీరోయిన్ సాయిపల్లవి నటిస్తున్నారు. ‘ఏక్ దిన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు టీజర్ రిలీజ్ కానుంది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్నారు. కాగా సాయిపల్లవి రణ్‌బీర్ ‘రామాయణ’లోనూ నటిస్తుండగా ఈ మూవీ దీపావళికి రిలీజ్ కానుంది.

News January 15, 2026

ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

image

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్‌ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్‌, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు.

News January 15, 2026

ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ పోస్టులు

image

<>ఐఐటీ<<>> రూర్కీ 9 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంసీఏ, PhD, PG, MD/MS, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు మాజీ ఆర్మీ/నేవీ/IAF అధికారులు, మాజీ DSP అధికారులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitr.ac.in