News January 17, 2025

30లక్షల శునకాలను వధించే యోచనలో మొరాకో?

image

FIFA ప్రపంచ కప్‌-2030 నేపథ్యంలో మొరాకోలోని పలు నగరాలను వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సందర్శించనున్నారు. అందుకు అనుగుణంగా నగరాలు మరింత అందంగా కనిపించేందుకు 30 లక్షల వీధి కుక్కలను వధించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని జంతు హక్కుల ప్రచారకర్త జేన్ గుడాల్ ఖండించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సంప్రదించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 5, 2025

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.

News February 5, 2025

తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం

image

దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్‌లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.

News February 5, 2025

విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం

image

AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

error: Content is protected !!