News January 17, 2025
కామారెడ్డి: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. తెలుగు, చరిత్ర బోధించడానికి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాసై ఉండాలన్నారు. పీహెచ్‌డీలో 50 శాతం మార్కులు, బోధనానుభవం కలిగిన ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు శనివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 9, 2026
తూ.గో: సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే!

సీఎం చంద్రబాబు శుక్రవారం తూ.గో జిల్లాలో పర్యటించనున్నారు. ఉ. 10:20 గంటలకు ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి రాయవరం చేరుకుంటారు.11:20 గంటలకు గ్రామ రైతులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. మ. 12:05 గంటలకు రాయవరంలో ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. మ. 2:05 గంటలకు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సా. 4:25 అమరావతి బయలుదేరి వెళ్తారు.
News January 9, 2026
తూ.గో: హోటళ్లు, రిసార్టులు హౌస్‌ఫుల్

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి తరలివస్తున్న అతిథులతో సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి 18 వరకు హోటళ్లు, రిసార్టులు ఇప్పటికే నిండిపోయాయి. కోడిపందాలు, పడవ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతున్నారు. అతిథుల మర్యాదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 9, 2026
గర్భాశయ రక్తస్రావం గురించి తెలుసా?

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిల్లో ఒకటే గర్భాశయ రక్తస్రావం. పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పీరియడ్స్ మధ్య స్పాటింగ్, సంభోగం తర్వాత రక్తస్రావం ఉన్నా గర్భాశయ రక్తస్రావం అంటారు. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


