News January 17, 2025

చాగంటికి తిరుమలలో అవమానమంటూ వార్తలు.. ఖండించిన TTD

image

AP: రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను TTD ఖండించింది. ప్రవచనం కోసం పిలిపించి కార్యక్రమాన్ని రద్దు చేశారనేది అవాస్తవమని పేర్కొంది. ఆయన అంగీకారంతోనే మరో రోజుకు వాయిదా వేశామంది. చాగంటినే సాధారణ భక్తుల తరహాలో శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అసత్య వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Similar News

News January 1, 2026

394 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

IOCLలో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.Tech, BE, BSc, ఇంటర్, డిప్లొమా, ITI ఉత్తీర్ణులై, వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, ఫిజికల్ టెస్ట్/స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 1, 2026

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

image

కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా ప‌లుచ‌గా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* క‌నుబొమ్మ‌లపై రోజూ ఆముదం నూనెను రాయ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా క‌ల‌బంద జెల్ ను క‌నుబొమ్మ‌ల‌పై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. * కొబ్బ‌రి నూనెలో రోజ్‌మేరీ నూనెను క‌లిపి క‌నుబొమ్మ‌ల‌పై మ‌ర్ద‌నా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.

News January 1, 2026

పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

image

కొత్త సంవత్సరం వేళ ఆయిల్ కంపెనీలు LPG సిలిండర్ల రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.111 పెరగ్గా, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.1,912కు చేరింది. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు LPG ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.