News March 17, 2024
ప్రజావాణి రద్దుకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు, వచ్చే జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదన్నారు.
Similar News
News September 5, 2025
NLG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి టోల్ ఫ్రీ నంబర్

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి 18005995991 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ బిల్లుల వివరాలు తెలుసుకునేందుకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
News September 5, 2025
నల్గొండ జిల్లాలో 15 సంఘాలకు గ్రీన్ సిగ్నల్

NLG జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14తో PACSల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 42 PACSలు ఉన్నాయి. ప్రస్తుతం PACSల పనితీరు ఆధారంగా 15 సంఘాల పాలకవర్గాల పదవీ కాలాన్ని మాత్రమే పొడిగించారు. మరో 15 సంఘాల పదవీ కాలాన్ని వాటి పనితీరు ఆధారంగా ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు డీసీఓ సిబ్బంది తెలిపారు.
News September 4, 2025
NLG: ఉత్తమ ఉపాధ్యాయులుగా 208 మంది ఎంపిక

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 208 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుక్రవారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు.