News March 17, 2024
వివాదాస్పదంగా FIITJEE ప్రకటన

FIITJEE కోచింగ్ సంస్థ తాజా ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ సంస్థను వదిలి వేరే సంస్థలో కోచింగ్ తీసుకున్న ఓ యువతి ప్రదర్శన దిగజారిందని పేర్కొంటూ ఆమె ఫొటోను ప్రకటనలో ప్రచురించింది. ఇక వేరే సంస్థలతో తమ సంస్థను పోల్చుకుంటూ.. ఒక సంస్థ పేరు కింద దానిలో అంతా ఆత్మహత్యలే అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో FIITJEEపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News April 11, 2025
సొంత గ్రౌండులో ఆర్సీబీ చెత్త రికార్డు

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదిక(బెంగళూరు-చిన్నస్వామి స్టేడియం)లో అత్యధిక సార్లు(45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ ఉండే హోమ్ గ్రౌండులోనే ఇలా ఓటములు ఎదురవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో DC(44), KKR(38), MI(34), PBKS(30) ఉన్నాయి. ఈ జట్లు కూడా తమ సొంత గ్రౌండ్లలోనే ఎక్కువసార్లు ఓడిపోవడం గమనార్హం.
News April 11, 2025
ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్లోనే: పరిశోధకులు

ప్రపంచంలోనే అత్యధిక క్షయ కేసులు భారత్లోనే నమోదవుతున్నాయని పలువురు పరిశోధకులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. క్షయపై చర్చించేందుకు హైదరాబాద్లో ప్రారంభమైన సదస్సులో వారు మాట్లాడారు. ‘క్షయ కారణంగా 2023లో 3 లక్షలమందికి పైగా కన్నుమూశారు. ముందే గుర్తిస్తే టీబీ మరణాన్ని అరికట్టొచ్చు. భారత్కు సవాలుగా మారిన దీనిపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
News April 11, 2025
వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

AP: పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. 2024-25కు గాను ప్రజలు చెల్లించాల్సిన పన్నుపై ఈ రాయితీ వర్తిస్తుంది. మార్చి నెలాఖరుతోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే సెలవుల వల్ల రాయితీ ఉపయోగించుకోలేకపోయామని విజ్ఞప్తులు రావడంతో పొడిగించింది.