News March 17, 2024

ములుగు జిల్లాలో 144 సెక్షన్- ఎస్పీ

image

ములుగు జిల్లాలో రేపు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ షాపులను సైతం మూసివేయాలని కోరారు. కాగా జిల్లాలో 3,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Similar News

News August 21, 2025

వరంగల్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్

image

యూరియా కొరత, ఇతర వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004253424, ఫోన్ నంబర్లు 0870-2530812, 9154252936లకు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

News August 20, 2025

వరంగల్ జిల్లాలో తగ్గిన వర్షాలు

image

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం వరకు 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సంగెంలో 18.4, నెక్కొండ 15.1, పర్వతగిరి 13.8 మి.మీ. వర్షం కురిసింది. చెన్నారావుపేటలో 12.3, ఖిల్లా వరంగల్, వర్ధన్నపేటలో 7.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. తక్కువగా వరంగల్ పట్టణంలో 2.4 మి.మీ. వర్షం నమోదైంది.

News August 20, 2025

WGL: నకిలీ డాక్టర్లను పట్టుకున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం

image

అర్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న సెంటర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇద్దరు నకిలీ డాక్టర్లను పట్టుకున్నట్లు కౌన్సిల్ సభ్యుడు డా.వి.నరేశ్ కుమార్ తెలిపారు. వరంగల్, కాశిబుగ్గ తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ డాక్టర్ అని పోస్టర్లు కొట్టించుకొని, ఆర్ఎంపీల జిల్లా ప్రెసిడెంట్‌గా చెప్పకుంటూ రోగులను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు.