News March 17, 2024
గాంధారిలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 6, 2026
NZB: CM పర్యటన.. ముందస్తు అరెస్ట్

నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ప్రచారం, TU పర్యటన రీత్యా PDSU NZB జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్‌ను ఉదయం 4 గంటలకు ఇంట్లో అరెస్ట్ చేశారు. రాజేశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తుందని, విద్యార్థుల కోసం ప్రశ్నించే గొంతులను నిర్బంధించటం సరైంది కాదని, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకున్నా అరెస్టు చేయటం ఏంటని వాపోయారు.
News February 6, 2026
ఆర్మూర్: కుటుంబ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆర్మూర్‌కు చెందిన వివాహిత సాగరిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధనంగా రూ.20 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు వేధించడంతో తీవ్ర మనోవేధనకు గురై ఉరేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తమ్ముడు సాయి కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
News February 6, 2026
NZB: గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.


