News January 18, 2025
ముడా కేసులో సిద్ధ రామయ్యకు ఈడీ షాక్
ముడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు.
Similar News
News January 18, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?
TG: రాష్ట్రంలోని స్కూళ్లకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాళ కూడా హాలిడే అంటూ కొన్ని స్కూళ్లు తల్లిదండ్రులకు మెసేజులు పంపించాయి. అటు హాస్టళ్లలో ఉండే చాలా మంది విద్యార్థులు ఇంకా స్వస్థలాల నుంచి రాలేదు. సోమవారం నుంచి వస్తామని చెబుతున్నారు. మరి ఇవాళ మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.
News January 18, 2025
బుల్లి రాజు మరో మాస్టర్ భరత్ అవుతాడా?
సినిమాల్లో మాస్టర్ భరత్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా శ్రీనువైట్ల సినిమాల్లో భరత్ చేసిన కామెడీ సూపర్. ఇప్పటికీ ఆ సీన్లు మీమ్స్ రూపంలో SMలో దర్శనమిస్తాయి. ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుడ్డోడు బుల్లిరాజు(రేవంత్) టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. చిన్నోడి కామెడీకి అభిమానులు ఫిదా అయ్యారు. రాబోయే రోజుల్లో భరత్ స్థానాన్ని ఈ చిన్నోడు భర్తీ చేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News January 18, 2025
ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్!
AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు ఏర్పాటు కానుంది. ఇందుకోసం పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ నిన్న మంత్రి లోకేశ్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,800 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే మార్చిలో శంకుస్థాపన చేయనున్నారు. తమ ఫ్యాక్టరీ నుంచి తొలి ఈవీ బైక్ 2026 డిసెంబర్ నాటికి విడుదలవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.