News March 17, 2024
స్పందన తాత్కాలికంగా నిలుపుదల: కలెక్టర్ రాజబాబు

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున కలెక్టర్ రాజబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్టణం కలెక్టరేట్‌లో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా కలెక్టర్ కోరారు.
Similar News
News January 31, 2026
ప్రభుత్వ పథకాల వారధులు వీఆర్‌ఏలే: కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. మచిలీపట్నంలో శుక్రవారం ఏపీ వీఆర్‌ఏ అసోసియేషన్ రూపొందించిన నూతన క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు, గన్నవరం సభ్యులు పాల్గొని తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
News January 30, 2026
ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి: కలెక్టర్

ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉద్యోగ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించిన పలు సమస్యలను వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
News January 29, 2026
కడప స్మార్ట్ కిచెన్ భేష్: కలెక్టర్ బాలాజీ

కడప సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణను పరిశీలించేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం కడపలో పర్యటించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్వహణ అద్భుతంగా ఉందని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే ఈ విధానం అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


