News January 18, 2025

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్

image

AP: నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2020 తర్వాత ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి(D) సుళ్లూరుపేటలోని నేలపట్టు, అటకానితిప్ప, బీవీ పాలెం, శ్రీసిటీ ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ జరగనుంది. 3 రోజుల్లో 5-6 లక్షల మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News January 12, 2026

పండుగల్లో ఇలా మెరిసిపోండి

image

* ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.

News January 12, 2026

అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>ఇండియన్ <<>>ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు(01/2027) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, ఇంటర్ అర్హత కలిగిన వారు నేటి నుంచి FEB 1 వరకు అప్లై చేసుకోవచ్చు. సరైన శారీరక ప్రమాణాలు కలిగి(ఎత్తు 152cm), JAN 1, 2006- JULY 1,2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: iafrecruitment.edcil.co.in

News January 12, 2026

మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

image

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.