News January 18, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లాప్‌టాప్, రెండు మొబైల్స్, 80 బ్యాంకు అకౌంటులను స్వాధీనం చేసుకొని వాటిలో రూ.140కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లావాదేవీలకు సహకరించిన నలుగురుని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.

Similar News

News February 28, 2026

విశాఖలో నేటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్

image

విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ‘టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (TCCL) ప్రారంభం కానుంది. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలో సుమారు 110 మంది సినీ, టీవీ ప్రముఖులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. పేద విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.

News February 28, 2026

విశాఖ: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీ

image

విశాఖ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు సందర్శిచారు. ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం వెంటనే చట్టమవుతుందని తెలిపారు. జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.53 కోట్లతో బ్యారక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు రోజుల శిక్షణ ముగింపులో అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.

News February 27, 2026

హోలీ పండుగ రద్దీ దృష్ట్యా విశాఖ- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం – పాట్నా మధ్య రెండు ప్రత్యేక రైళ్లను (08537/08538) నడపాలని వాల్తేరు రైల్వే విభాగం నిర్ణయించింది. మార్చి 1, 8 తేదీల్లో విశాఖ నుంచి, మార్చి 2, 9 తేదీల్లో పాట్నా నుంచి ఈ రైళ్లు బయలుదేరుతాయి. విజయనగరం, బొబ్బిలి, రాయగడ మీదుగా నడిచే ఈ రైలు సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.