News January 18, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?
TG: రాష్ట్రంలోని స్కూళ్లకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాళ కూడా హాలిడే అంటూ కొన్ని స్కూళ్లు తల్లిదండ్రులకు మెసేజులు పంపించాయి. అటు హాస్టళ్లలో ఉండే చాలా మంది విద్యార్థులు ఇంకా స్వస్థలాల నుంచి రాలేదు. సోమవారం నుంచి వస్తామని చెబుతున్నారు. మరి ఇవాళ మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.
Similar News
News January 18, 2025
అన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి: తమన్
చిరంజీవి <<15185812>>ప్రశంసలపై<<>> తమన్ స్పందించారు. ‘డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని, కళ్లు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. అర్థం చేసుకుని మీరు చెప్పిన మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి’ అని ట్వీట్ చేశారు.
News January 18, 2025
CBIపై బాధితురాలి తండ్రి ఆరోపణలు
కోల్‌కతా హత్యాచార ఘటనపై CBI దర్యాప్తు పూర్తిగా చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఇందులో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైతే సంజయ్‌ను మాత్రమే నిందితుడిగా చేర్చారని చెప్పారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా ఆ శాంపిల్ సేకరించలేదన్నారు. అటు కేసు పురోగతిని ఎంత అడిగినా చెప్పలేదన్నారు. నేడు కోర్టుకు తమను పిలవలేదని, తమ లాయర్‌నూ రావద్దని కోరినట్లు తెలిపారు.
News January 18, 2025
కొత్త రేషన్ కార్డులపై UPDATE
TG: రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో 11.65 లక్షల మంది పేర్లు ఉన్నాయి. ఈ నెల 20-24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు పెట్టి అభ్యంతరాలు సేకరించిన తర్వాత తుది జాబితా ఖరారు చేస్తారు. ఇలా కలెక్టర్ల ద్వారా వచ్చే లిస్టులతో జనవరి 26 నుంచి కార్డులు మంజూరు చేస్తారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండనున్నాయి.