News January 18, 2025

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. స్టేటస్‌లకు మ్యూజిక్!

image

వాట్సాప్‌లో స్టేటస్‌లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ వచ్చింది. ఫొటోలకు 15 సెకన్లు, వీడియోలకు వాటి నిడివిని బట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఆడియో కోసం సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News July 7, 2025

నేడు ఐసెట్ ఫలితాలు విడుదల.. Way2Newsలో వేగంగా..

image

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు ఇవాళ మ.3 గంటలకు విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.

News July 7, 2025

BIG ALERT.. అతి భారీ వర్షాలు

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అటు రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్న పలు జిల్లాల్లో వర్షాలు పడిన సంగతి తెలిసిందే.

News July 7, 2025

డార్క్ చాక్లెట్‌ తినడం వల్ల లాభాలు!

image

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది