News January 18, 2025
INSPIRING.. 30 కేజీలు తగ్గిన హీరోయిన్

‘బందీశ్ బందిట్స్’ హీరోయిన్ శ్రేయా చౌదరీ ఒక దశలో 30 కేజీల బరువు తగ్గినట్లు చెప్పారు. 19 ఏళ్ల వయసులో వెన్నెముక సమస్యలతో విపరీతమైన బరువు పెరిగినట్లు చెప్పారు. అయితే తన ఐడల్ హృతిక్ రోషన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఫిట్‌నెస్ జర్నీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా మారినట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని SMలో పోస్ట్ చేయగా అభిమానులు మద్దతుగా నిలిచారని చెప్పారు.
Similar News
News November 14, 2025
ఇక బెంగాల్ వంతు: కేంద్ర మంత్రి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, ఇక తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బిహార్ నిర్ణయించుకుంది. ఇక్కడి యువత తెలివైనది. ఇది అభివృద్ధి సాధించిన విజయం. బెంగాల్‌లో అరాచక ప్రభుత్వం ఉంది. అక్కడా మేం గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వచ్చే ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
News November 14, 2025
4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్‌లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.
News November 14, 2025
వంటింటి చిట్కాలు

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.


