News January 18, 2025
GOOD NEWS: ఉచితంగా ప్లాట్లు

AP: ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి <<15179066>>ఇళ్ల స్థలాలు<<>> ఇస్తామని నిన్న ప్రకటించింది. ఇవి ఉచితమా? డబ్బు చెల్లించాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇళ్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇస్తారు.
Similar News
News July 4, 2025
భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.
News July 4, 2025
ఖాళీ అవుతోన్న ‘తువాలు’

పసిఫిక్ మహాసముద్రంలోని కేవలం 5 మీటర్ల ఎత్తులో ఉండే ‘తువాలు’ దేశం ఖాళీ అవుతోంది. కొన్ని దీవుల సముదాయమైన ఈ దేశంలోని మెజారిటీ భూభాగం 2050 నాటికి సముద్రంలో కలిసిపోతుందని NASA హెచ్చరించడంతో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందంతో ‘క్లైమెట్ వీసా’ కోసం దేశంలోని 10643 మందిలో మూడో వంతు ప్రజలు అప్లై చేసుకున్నారు. కానీ ఏడాదికి 280 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.
News July 4, 2025
ఇంగ్లండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్

INDతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (57*), స్మిత్ (57*) దూకుడుగా ఆడుతున్నారు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు (4, 6, 4, 4, 4) బాదారు. ఆ ఒక్క ఓవర్లోనే 23 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ENG స్కోర్ 169/5గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 6 ఓవర్లలోనే 43 రన్స్ సమర్పించుకున్నారు.