News January 18, 2025
డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.
Similar News
News January 18, 2025
ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?
అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2025
కొలికపూడిపై అధిష్ఠానం సీరియస్.. చర్యలకు సిద్ధం!
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమైంది. ఇటీవల ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరవ్వాలని కొలికపూడిని ఆదేశించింది. గతంలోనూ ఆయన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
News January 18, 2025
చావు నుంచి తప్పించుకున్నా.. కానీ: షేక్ హసీనా
గత ఏడాది ఆగస్టులో నిరసనకారులు తనను, చెల్లెలిని చంపబోయారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. ఆ రోజు నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమె తాజాగా ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే దేవుడు తనను ప్రాణాలతో ఉంచారన్నారు. అయితే తన ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.