News January 18, 2025

దొంగతనం చేయలేదు: కరీనా కపూర్

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్‌ను చాలా సార్లు పొడిచాడని ఆమె తెలిపారు. తమ కుమారుడు జహంగీర్ వద్దకు వెళ్లేందుకు పదే పదే ప్రయత్నించాడని, సైఫ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇంట్లో ఎలాంటి డబ్బులు, ఆభరణాలు దొంగతనం చేయలేదని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News January 18, 2025

భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?

image

ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్‌లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.

News January 18, 2025

ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?

image

అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్‌ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.

News January 18, 2025

కొలికపూడిపై అధిష్ఠానం సీరియస్.. చర్యలకు సిద్ధం!

image

AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమైంది. ఇటీవల ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరవ్వాలని కొలికపూడిని ఆదేశించింది. గతంలోనూ ఆయన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.