News March 17, 2024
కేసీఆర్‌కు ఝలకిచ్చే ప్లాన్!

కాంగ్రెస్‌లో BRSLP విలీనం దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చట్టపరంగా 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే BRS పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా బీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టడమే కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది.
Similar News
News September 9, 2025
వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
News September 9, 2025
ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటీస్‌లు

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-చాందీపూర్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/
News September 9, 2025
రేపటి నుంచే పీఈసెట్ కౌన్సెలింగ్

AP PECET(వ్యాయామ విద్య) కౌన్సెలింగ్ రేపటినుంచి జరగనుంది. విద్యార్థులు ఈ నెల 13వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 11 నుంచి 14వరకు, కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదు 14నుంచి 16వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎడిట్ ఈ నెల 17న అవకాశం ఇచ్చారు. ఈ నెల 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.