News January 18, 2025

NZB: ఏడు నెలల కిందట మిస్సింగ్.. ఇప్పుడు ఎముకలు లభ్యం

image

ఏడు నెలల కిందట అదృశ్యమైన మహిళ ఎముకలు లభ్యమయ్యాయి. ఈ ఘటన మోపాల్ మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన విజయ ఏడు నెలల కిందట అదృశ్యమైంది. అయితే రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మంచిప్ప ప్రాంతంలోని ఒక కల్వర్టు కింద మహిళ ఎముకలను గుర్తించారు. ఘటన స్థలాన్ని ACP రాజ వెంకటరెడ్డి, CI సురేశ్, SI యాదగిరి గౌడ్ పరిశీలించారు.

Similar News

News September 19, 2025

నేడు YCP ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

image

AP: మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

News September 19, 2025

వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

image

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.

News September 19, 2025

VKB: ‘మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి’

image

నిరుపేద మహిళలను మహిళా సంఘాల్లో 100% చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్‌తో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా పయనించాలన్నారు.