News January 18, 2025
CTR: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళకు గాయాలు

చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈక్రమంలో ఓ మహిళ గాయపడింది. వెంటనే రిక్రూట్మెంట్ ఇన్‌ఛార్జ్, సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న సంబంధిత సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాయల్పాడుకు చెందిన షకీలాగా గుర్తించారు. 1600 మీటర్ల పరుగు పందెంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు.
Similar News
News January 26, 2026
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SP

చిత్తూరు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ రిపబ్లిక్ డే పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. సిబ్బందికి ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఎంటీఓ వీరేశ్ పాల్గొన్నారు.
News January 26, 2026
చిత్తూరు: జెండా వందనం చేసిన కలెక్టర్

చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా. థామస్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా అధికార యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు.
News January 26, 2026
చిత్తూరులో పీజీఆర్ఎస్ రద్దు

సోమవారం కలెక్టరేట్, పోలీసు జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఆ కార్యక్రమం రద్దు చేసినట్లు వెల్లడించారు. వచ్చేవారం నుంచి యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.


