News January 18, 2025

రాయలసీమను రతనాల సీమగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

image

AP, కేంద్రంలో NDA ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లూ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరులో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల అనుసంధానమైతే గేమ్‌ఛేంజర్‌ అవుతుందని పేర్కొన్నారు.

Similar News

News February 5, 2025

పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..

image

పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News February 5, 2025

ఏపీలో మిరప బోర్డు కోసం ప్రతిపాదనలు

image

APలో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల బోర్డే దేశంలో మిర్చి ఉత్పత్తి, పరిశోధన, నాణ్యతా నిర్వహణ, దేశీయ మార్కెట్, ఎగుమతులు, ప్రోత్సాహకాలు సహా పలు విషయాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. మిర్చి నిల్వ పద్ధతులు, మార్కెట్ లింకేజ్ సహా ఇతర అంశాలపై రైతులు, వ్యాపారులకు ఈ బోర్డే సహాయం అందిస్తోందని వెల్లడించారు.

News February 5, 2025

టెట్ ఫలితాలు వాయిదా

image

TG: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల కావాల్సి ఉండగా, MLC ఎన్నికల కోడ్‌తో వాయిదాపడ్డాయి. తొలుత ప్రకటించాలని భావించినా, టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లో(HYD, రంగారెడ్డి, MBNR మినహా) MLC కోడ్ అమల్లో ఉంది.

error: Content is protected !!