News January 18, 2025

చావు నుంచి తప్పించుకున్నా.. కానీ: షేక్ హసీనా

image

గత ఏడాది ఆగస్టులో నిరసనకారులు తనను, చెల్లెలిని చంపబోయారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. ఆ రోజు నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె తాజాగా ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే దేవుడు తనను ప్రాణాలతో ఉంచారన్నారు. అయితే తన ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News January 19, 2025

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. మరోవైపు రేపు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.

News January 19, 2025

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.

News January 19, 2025

సైఫ్‌పై దాడి.. థానేలో నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడిని ఓ రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లు తెలిపింది. సుమారు 100 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.