News January 18, 2025

ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?

image

అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్‌ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.

Similar News

News January 25, 2026

మీ కరెంట్ బిల్లు పంపండి.. WFH ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్

image

వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసే తమ ఉద్యోగులను ఇంటి కరెంట్ బిల్లు షేర్ చేయాలని కోరుతూ ఇన్ఫోసిస్ ఇటీవల మెయిల్ పంపింది. కంపెనీ రీస్ట్రక్చరింగ్‌తో దీనికి సంబంధం లేదని.. ఆందోళన చెందొద్దని తెలిపింది. కంపెనీ విద్యుత్తు వినియోగంతో పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ యూసేజ్‌ను తగ్గించాలని పెట్టుకున్న తమ లక్ష్యాన్ని గుర్తుచేసింది.

News January 25, 2026

వెనిజులాపై సైనిక దాడి.. 15నిమిషాలే టైమిచ్చారు: డెన్సీ రోడ్రిగ్జ్

image

వెనిజులాపై అమెరికా సైనిక దాడిలో ఎదురైన సవాళ్ల గురించి తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ సంభాషణ వీడియో లీకైంది. తమ డిమాండ్లను అంగీకరిస్తారా? లేక చస్తారా? అని అమెరికా దళాలు బెదిరించినట్లు అందులో రికార్డైంది. తనతోపాటు ఇంటర్నల్ మినిస్టర్ డియోస్డాడో కాబెల్లో, మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్‌కు 15నిమిషాలు టైమ్ ఇచ్చారన్నారు. మదురో ఆయన భార్యను చంపేసినట్లు యూఎస్ దళాలు ముందుగా తమకు చెప్పాయని తెలిపారు.

News January 25, 2026

Republic day Special : దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

image

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గాంధీజీ పిలుపు మేరకు ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. సంఘసంస్కరణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించారు. 1929లో మహిళా ఉద్ధరణకు మద్రాసులో ‘ఆంధ్ర మహిళా సభ’ను స్థాపించారు. ఈ పేరుతోనే హైదరాబాదులోనూ 1958లో స్థాపించి స్త్రీ జనోద్ధరణకు సహాయకారిగా నిలిచారు.