News March 17, 2024

కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల్లో పంట నష్టం

image

గత రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 రైతులకు చెందిన 20,071 ఎకరాల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు కొంతమేర గోధుమ, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

Similar News

News July 5, 2024

యూకే ఎన్నికల్లో నిజామాబాదీ ఓటమి

image

UKలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6221 ఓట్లు మాత్రమే రావటంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్లి స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

News July 5, 2024

NZB: ఉరేసుకుని కండక్టర్ ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. జిల్లాలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఈరవత్రి శ్రీనివాస్ (36) కండక్టర్‌గా పని చేస్తూ నిజామాబాద్ నాందేవ్ వాడాలో అద్దెకు ఉంటున్నాడు. కిడ్నీ నొప్పి భరించలేక గురువారం రాత్రి రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2024

కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచారం

image

సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గురువారం తెలిపారు. దీంతో ప్రధానంగా రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ పంటలు వేసే సమయంలో ఎలుగుబంటి రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.